ఒక్క రోజులోనే ఇండియా లో ఎన్ని కరోనా కేసులు పెరిగాయో తెలుసా..?

ఇండియాలో కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నాయి. చాల వరకు లాక్ డౌన్ ఎత్తయడం తో కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 3320 కొత్త కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా దేశంలో రోజుకు మూడు వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం తో ప్రజల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు ఇండియాలో 59,662 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1307 మంది డిశ్చార్జ్ కాగా, 92 మంది మరణించారు. మరణాల సంఖ్య తగ్గడం ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవాలి.