కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద చిరుత


లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల సంచారం కాస్త తగ్గడంతో అటవీ జంతువులు యథేశ్చగా తిరుగుతున్నాయి. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద స్థానికులు చిరుతను గుర్తించారు.

ఎన్‌హెచ్‌-7 ప్రధాన రహదారిపై గాయపడిన చిరుతను స్థానికులు గుర్తించారు. గాయాల కారణంగా చిరుత ఎటూ కదలలేని పరిస్థితి. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై రాకపోకలను నియంత్రించారు. చిరుతను చూసేందుకు జనం భారీగా గుమికూడారు.