విశాఖ పోర్ట్ ట్రస్ట్ రూ.75 లక్షల విరాళం

కరోనా నివారణ చర్యల కోసం ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ.75 లక్షల విరాళం ఇచ్చింది. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామమోహన్‌రావు చెక్కు అందజేశారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

అంతేకాకుండా ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్ రూ.50 లక్షల విరాళమిచ్చింది. సీఎం జగన్‌కు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి చెక్కు అందించారు.