ముచ్చట్లే కరోనా కేసులు పెరగడానికి కారణం ..

లాక్ డౌన్ 4 కు వచ్చినప్పటికీ ఇండియా లో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్రం కుటుంబ, ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 5,242 కొత్త కేసులు నమోదు అయ్యాయి. లాక్ డౌన్ పటిష్టం గా జరుగుతున్నప్పటికీ కేసులు పెరగడానికి కారణం ఇంట్లో వ్యక్తులు ఇంట్లోనే ఉండకుండా అపార్టుమెంట్ల పైనా, సందుల్లో, గొందుల్లో చేరి గంటల తరబడి ముచ్చట్లు పెడుతున్నారు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఆ సమయంలో ఎవరికీ ఎలాంటి లక్షణాలు ఉన్నా అవి మిగతా వారికీ సోకుతున్నాయి. ఫలితంగా కరోనా వ్యాపిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి ఇలానే ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పార్టీల పేరుతో అపార్టుమెంట్లలో జరిగే వేడులకు ఆ అపార్ట్మెంట్ వాసులు హాజరవుతుండటం కూడా కరోనా వ్యాపించడానికి కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు.