తెలంగాణలో 27 కొత్త కేసులు


తెలంగాణలో ఈ రోజు 27 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,661కి పెరిగింది. ఇందులో 1,013 మంది డిశ్చార్జికాగా, 40 మంది చనిపోయారు. 608 మంది చికిత్స పొందుతున్నారు.

ఈ రోజు ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు నమోదైన కేసుల్లో 15 జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాగా, 12 ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారివి. ఇప్పటివరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 89 మందికి కరోనా సోకింది.