
రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు శుక్రవారం నుంచి తెరుచుకోనున్నాయని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులోకి లేని వారికి కూడా టికెట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించేందుకు ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అలాగే, నిర్దేశిత రైల్వేస్టేషన్లలో సైతం రెండు మూడు రోజుల్లో బుకింగ్స్ ప్రారంభిస్తామని చెప్పారు.









