దేశంలో కరోనా ఉగ్రరూపం.. మరింతగా

భారత్‌ కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత మూడురోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో అత్యధికంగా 6767పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

భారత్‌లో వైరస్‌ బయటపడ్డ తరువాత 24గంటల్లో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,31,868కి చేరింది. వీరిలో నిన్న ఒక్కరోజే 147మంది మృత్యువాతపడడంతో మొత్తం కొవిడ్‌ సోకి మరణించినవారి సంఖ్య 3867కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.