
ప్రభాస్ – పూజా హగ్దే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ రాధే శ్యామ్. భారీ అంచనాల మధ్య మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రెండో వారం పూర్తికాకముందే థియేటర్స్ నుండి వెళ్ళిపోయినా ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తుంది.
డిజిటల్ స్క్రీన్ మీద బోరింగ్ సీన్స్ స్కిప్ చేసే అవకాశం ఉండటంతో.. ఎక్కువ మంది ఈ సినిమా చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో థియేటర్ కు మించిన క్రేజ్ తో ఓటీటీలో భారీ వ్యూయర్ షిప్ సాధిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ చేసుకున్న తేదీ కంటే కొంచెం ముందుగానే ఓటీటీలో విడుదల చేశారు. మార్చి 11న థియేట్రికల్ రిలీజ్ కాబడిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న తెలుగుతో పాటుగా తమిళ కన్నడ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ పెట్టారు. ఇందుకుగాను మేకర్స్ కు మరో 25 కోట్లు అదనంగా చెల్లిందని సమాచారం.









