
అ ఆ.. , ప్రేమమ్ చిత్రాలతో యూత్ ను ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత 2017 ‘శతమానంభవతి’ చిత్రం తో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయింది. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ కి ‘కార్తికేయ 2’ భారీ హిట్ ను అందించింది. తన తదుపరి చిత్రాలు 18 పేజెస్, బట్టర్ ఫ్లై చిత్రాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి
తాజాగా ఆమె రవితేజ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సోషల్ మీడియా టాక్. ‘కార్తికేయ 2’ సినిమాకి సినిమాటోగ్రఫర్ గా .. ఎడిటర్ గా వ్యవహరించిన కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడిగా రవితేజతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి ‘ఈగల్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు.
ఈ సినిమాలో కథానాయికగా ఆయన అనుపమను తీసుకున్నట్టుగా సమాచారం.









