ఓటీటీలోకి బ్రహ్మాస్త్ర …?


ఇటీవల బాలీవుడ్ చిత్రాలకు బాయ్ కాట్ సెగ తగలడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య వచ్చిన ప్రతి భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమా అట్టర్ ప్లాప్ అవుతూ వస్తున్నాయి. ఈ మధ్యే విడుదలైన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ . రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అక్కినేని నాగార్జున.. ఇలా ఈ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ వుంది. పైగా జక్కన్న రాజమౌళి ఈ సినిమాను తెలుగులో సమర్పించాడు. అలాగే సినిమాను తనదైన స్టయిల్లో ప్రమోట్ చేశాడు. దీంతో బ్రహ్మాస్త్ర మూవీ గట్టెక్కింది చెప్పొచ్చు. సెప్టెంబర్ 9వ తేదీన‌ పాన్ ఇండియా మూవీగా విడుదలై అన్నీ భాషల్లోనూ మంచి కలెక్షన్లను రాబట్టి ఏకంగా రూ.400 కోట్ల క్లబ్ లో చేరింది.

తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. విడుదలైన నెల రోజులకే ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రసారం చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని అక్టోబర్ 3వ వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది.