‘ధమ్కీ’ కోసం వస్తోన్న ‘మాస్ అమ్మ మొగుడు’


డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో మేకర్స్ మూవీని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 17 న ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారకంగా తెలిపింది. ఇక ఈ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నారని ఈ మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విశ్వక్ సేన్ చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read :  Peddi collections: కర్ణాటకలో ‘పెద్ది’ కలెక్షన్ల జాతర.. పుష్ప 2, ఓజీ రికార్డులు గాల్లోకి! రూ.3.02 కోట్లతో ఆల్ టైమ్ రికార్డ్స్..

అయితే ఇప్పుడు మేకర్స్ ఇది కన్ఫర్మ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 17 న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నామని.. ఇక మాస్ అమ్మ మొగుడు ‘ఎన్టీఆర్’ ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్నారని తెలిపారు. ఇకపోతే విశ్వక్ ఎన్టీఆర్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అని తెలిసిందే.

Also Read :  Killer Movie Accident: 'కిల్లర్' షూటింగ్‌లో ఘోరం.. బిన్నీ మిల్స్ పేలుడులో ఒకరు మృతి!

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో విశ్వక్ కి జోడిగా నివేదా పేతురాజ్ నటించగా.. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో నటించారు.