Kalki 2898 AD : ‘కల్కి’ రిలీజ్ డేట్ ఫిక్స్..


బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రభాస్ దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ సినిమాతో కంబ్యాక్ హిట్ కొట్టాడు. 750 కోట్లు రాబట్టి ఇంకా థియేటర్స్‌లో స్ట్రాంగ్‌గా నిలబడిన సలార్ సినిమాతో ప్రభాస్ ఫైనల్‌గా 800 కోట్ల వరకూ కలెక్ట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇండియాస్ బెస్ట్ కంబ్యాక్స్ ఇచ్చిన ప్రభాస్ నెక్స్ట్ పాన్ వరల్డ్ బాక్సాఫీస్‌ని టార్గెట్ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో.. వైజయంతీ మూవీస్ బ్యానర్లో భారీ బడ్జట్‌తో కల్కి 2898AD సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌ కీ రోల్ ప్లే చేస్తుండగా.. దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

కల్కి 2898AD ఇండియాస్ నెక్స్ట్ బిగ్ థింగ్‌లా కనిపిస్తోంది. ఇప్పటికే భారీ హైప్ ఉన్న కల్కి మూవీ.. రిలీజ్ టైమ్‌కి వరల్డ్ వైడ్ బజ్ జనరేట్ చేయడం గ్యారెంటీ. అయితే సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కావాల్సిన కల్కి 2898AD మూవీ వాయిదా పడి వెనక్కి వెళ్లింది. దీంతో ఇదే రోజు కల్కి కొత్త రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా.. యుద్ధానికి సిద్ధమంటూ, సైన్యం ముందు ప్రభాస్ యుద్ధ వీరుడిలా నిలిచున్న సాలిడ్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. 6000 సంవత్సరాల క్రితం ముగిసిన కథ.. 2024 మే 9న బిగిన్స్ అంటూ అనౌన్స్ చేశారు. ఇప్పటివరకూ మే 9న వైజయంతి మూవీస్ నుంచి వచ్చి సినిమాలు నెవర్ బిఫోర్ హిట్స్‌గా మారాయి. ఈ సెంటిమెంట్‌ని బిలీవ్ చేస్తూ 2024 మే 9న కల్కిని రిలీజ్ చేస్తున్నారు. మరి కల్కి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Hanu Man Review : హనుమాన్ రివ్యూ – పర్ఫెక్ట్ సూపర్ హీరో మూవీ