Hanu Man Review : హనుమాన్ రివ్యూ – పర్ఫెక్ట్ సూపర్ హీరో మూవీ

Hanuman Review

TELUGUMIRCHI RATING : 3.5/5
మోస్ట్ టాలెంటెడ్ యంగ్ టీమ్ గా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అండ్ హీరో తేజ సజ్జ. జాంబీ రెడ్డి సినిమాతో కొత్త జానర్ లో మూవీ చేసి హిట్ కొట్టిన ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ ఇప్పుడు సూపర్ హీరో జానర్ కి మన ఇండియన్ మైథలజీని మిక్స్ చేసి ‘హనుమాన్’ సినిమా చేసారు. చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న హనుమాన్ జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథ:

ప్రతి ఫిక్షనల్ సూపర్ హీరో సినిమాలో ఉన్నట్లే.. ఒక సూపర్ పవర్ ని సొంతం చేసుకోవాలి అనుకునే విలన్.. అతన్ని ఆపే హీరో. ఈ ఇద్దరి మధ్య పోరాటమే కథగా మారుతుంది. బ్యాక్ డ్రాప్స్ మారుతూ ఉంటాయి కానీ సెటప్ మధ్య గుడ్ అండ్ బ్యాడ్ ఫోర్సెస్ మధ్యలోనే ఉంటాయి. హనుమాన్ కూడా ఇలాంటి కథనే. అంజనాద్రి అనే ఊరిలో అక్క అంజమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్)తో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు హనుమంతు (తేజ సజ్జ). ఊరిలో అల్లరల్లరి చేసే హనుమంతు.. మీనాక్షి (అమృత అయ్యర్) తో ప్రేమలో పడతాడు. ఆమె పైన కొంతమంది చేసే దాడి నుంచి ఆమెని కాపాడబోయి హనుమంతు పెద్ద జలపాతంలో పడిపోతాడు. ఇక్కడి ఇండియన్ మైథలజీని తీసుకోని వచ్చిన ప్రశాంత్ వర్మ.. జలపాతం లోపల ఆంజనేయస్వామి రక్త ధారతో ఏర్పడిన రుధిర మణి హనుమంతు చేతికి చేరుతుంది. సూర్యకాంతి తగలగానే ఆంజనేయుడి శక్తులు వచ్చే ఆ మణి హనుమంతు చేతికి దొరకడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. చిన్ననాటి నుంచి ఎలా అయినా సూపర్ హీరో అయిపోవాలి అని కలలు కంటూ దానికోసం సొంత తల్లిదండ్రులను కూడా చంపేసిన మైఖేల్ (వినయ్ రాయ్) హనుమంతు దగ్గర ఉన్న మణి కోసం ఏం చేసాడు? ఆ మణి పగలు మాత్రమే ఎందుకు పని చేస్తుంది? హనుమంతు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే కథ.

విశ్లేషణ:

కథ పరంగా చూసుకుంటే హనుమాన్ ఫ్రెష్ పాయింట్ ఏం కాదు కానీ కథనం మాత్రం బాగుంది. విజువల్స్ తో ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేసి చూపించాడు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా ఇది తక్కువ బడ్జట్ లో చేసిన సినిమాలా అనిపించదు. అంత రిచ్ గా హనుమాన్ సినిమాని చేసినందుకు ప్రశాంత్ వర్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. త్వరగా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి కథలోకి వెళ్లిపోయిన ప్రశాంత్ వర్మ.. ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడమే పనిగా పెట్టుకున్నాడు. టైటిల్ కార్డు నుంచి ఎండ్ కార్డు వరకు ప్రశాంత్ వర్మ ఒక హై బడ్జట్ విజువల్ వండర్ ని చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఇండియన్ ఫిల్మ్స్ లో ది బెస్ట్ ఎండింగ్స్ లో ఒకటిగా నిలిచేలా డిజైన్ చేసాడు అంతే బెస్ట్ గా ఎగ్జిక్యూట్ చేసాడు ప్రశాంత్ వర్మ. సింపుల్ గా చెప్పాలి అంటే హనుమాన్ కంప్లీట్ గా డైరెక్టర్స్ ఫిల్మ్. ఇతర సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే హనుమాన్ సినిమా కోసం ప్రతి ఒక్కరూ పడిన కష్టం తెరపై కనిపిస్తోంది. అంజనాద్రిని డిజైన్ చేసిన ఆర్ట్ వర్క్ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ చేసిన వాళ్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ క్లైమాక్స్ సాంగ్ హనుమాన్ సినిమాకి స్పెషల్ ఎస్సెట్స్ అయ్యాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే హనుమంతు అనే క్యారెక్టర్ లో తేజ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఎక్కడా అతను సినిమా వెయిట్ ని ఎక్కువగా మోస్తున్నాడు అనిపించదు, కంప్లీట్ గా ఓన్ చేసుకోని చాలా కాన్ఫిడెంట్ గా ఆడియన్స్ ని బిలీవ్ చేసేలా చేసాడు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ లు మంచి పాత్రల్లో మెరిశారు. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, రాకేష్ మాస్టర్ మంచి ఫన్ జనరేట్ చేసారు. ఓవరాల్ గా యాక్టర్స్, డైరెక్టర్, ఇతర టెక్నీషియన్స్ అంతా కలిసి హనుమాన్ సినిమాని పర్ఫెక్ట్ సూపర్ హీరో సినిమాగా మలిచారు.