Peddi : ‘పెద్ది’ డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

Peddi
Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం’పెద్ది’ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సోషల్ మీడియాలో దుమ్మురేపగా, ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ‘చికిరి చికిరి’ పాటలో రామ్ చరణ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

తాజాగా ‘పెద్ది’ డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. డబ్బింగ్ స్టూడియోలో చరణ్ చేసిన సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ”బుచ్చి.. చికిరి పాటలో మోహిత్ చౌహాన్ వాయిస్ కి నువ్వు ఎంత యాక్టింగ్ చేశావంటే.. నువ్వు పాడావా ఆయన పాడాడా? అనే డౌట్ వచ్చిందయ్యా.. డబ్బింగ్ లో కూడా అలా యాక్టింగ్ చేయమని చెప్పకు. డబ్బింగ్ నేనే చెప్పానండి” అంటూ దర్శకుడితో చరణ్ సరదాగా మాట్లాడిన వీడియో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఇక మార్చి 2న విడుదల కానున్న సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.