Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్

Sss
Sampradayini Suppini Suddapoosani Trailer : ‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ-లయ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి విజయాల తరువాత, ఈ సినిమాను ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్నారు. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ఇక ట్రైలర్ ఓ పక్క నవ్వులు పూయిస్తూనే, మరోపక్క ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

Also Read :  Buchi Babu: పెళ్లి రోజున కూడా కంటిమీద కునుకు లేదు.. 'పెద్ది' కోసం బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ తపస్సు!

సాధారణ మధ్యతరగతి కుటుంబం అనుకోకుండా కొన్ని విచిత్రమైన, ఊహించని నేరాలలో ఎలా ఇరుక్కుందో, ఆ పరిస్థితులు ఏంటి అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా రూపొందింది. క్రైమ్, కామెడీ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్‌కు రంజిన్ రాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీగా శివాజీ, ఆయన భార్య ఉత్తరగా డిఫరెంట్ పాత్రలో లయ నటించారు. ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, మాస్టర్ రోహన్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 6, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read :  Raghava Lawrence: సినిమా టు పాలిటిక్స్.. విజయ్ 'టీవీకే'లో చేరిన రాఘవ లారెన్స్! సీఎం సీటు నుంచే బరిలోకి!