Kiran Abbavaram : కెమెరా అసిస్టెంట్‌నే హీరో చేస్తున్న కిరణ్ అబ్బవరం.. రియల్ హీరో అంటే ఇదే కదా !

Kiran Abbavaram
Kiran Abbavaram

Kiran Abbavaram : షార్ట్ ఫిలింస్ స్థాయిలో ప్రారంభమై, కష్టాలు ఎదుర్కొంటూ హీరోగా స్థిరపడిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగా కూడా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి పేరు సంపాదించిన కిరణ్, తనలాంటి కలలతో వచ్చిన ఔత్సాహిక నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘కేఏ ప్రొడక్షన్స్’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. గతంలో తన సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన రామ్ చరణ్‌ను హీరోగా, తన మూవీకి ఆన్‌లైన్ ఎడిటింగ్ చేసిన టెక్నీషియన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందే ఈ ఎమోషనల్ డ్రామా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం స్పందిస్తూ, “ప్రతి ప్రయాణం ఒక కలతో మొదలవుతుంది. నేను కూడా ఏడేళ్ల క్రితం ఓ కలతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ఆదరణతో ముందుకు వెళ్తున్నాను. నాలాగే ఒక కలతో సినిమా‌ పరిశ్రమకు వచ్చే యంగ్ టాలెంట్ కు మా కేఏ ప్రొడక్షన్స్ ద్వారా అవకాశాలు అందించాలని ప్రయత్నిస్తున్నాం. ఈ నెల 10న ఈ సినిమా అనౌన్స్ చేస్తున్నాం. నా జర్నీలో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ” అన్నారు. ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమా ద్వారా కిరణ్, తనతో కలిసి ప్రయాణం ప్రారంభించిన ఎంతోమంది టెక్నీషియన్లను కూడా ముందుకు తీసుకొస్తున్నారు. తాను నడిచిన మార్గాన్ని మరిచిపోకుండా, కొత్తవారికి వేదిక కల్పించే హీరోగా కిరణ్ అబ్బవరం industryకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.