రివ్యూ : మరువ తరమా

Maruva tarama review
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5
“మరువ తరమా” చిత్రంలో ప్రేమ ఇష్క్ కాదల్, వైశాఖం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హరీష్ ధనుంజయ్ హీరోగా కనిపించాడు. అవంతిక, అతుల్య చంద్ర హీరోయిన్‌లుగా నటించగా, చైతన్య వర్మ నడింపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ట్రైలర్, సాంగ్స్‌తో యూత్‌లో మంచి బజ్ క్రియేట్ చేయడంతో గురువారం రాత్రి ప్రీమియర్స్‌తో సినిమా విడుదలైంది. ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఈ కథలో మూడు పాత్రల మధ్య నడిచే ప్రేమ కథనే ప్రధానంగా చూపించారు.

కథలో రిషి, సింధు, అన్వీ ముగ్గురూ ఒకే ఆఫీస్‌లో పనిచేస్తారు. సింధును చూసిన వెంటనే రిషి ఆమెపై ప్రేమలో పడతాడు. మరోవైపు అన్వీ కూడా రిషిని ఎంతో ఇష్టపడుతుంది కానీ అతని మనసు సింధు వైపు ఉందని తెలిసి తన ప్రేమను బయటపెట్టదు. రిషి–సింధుల ప్రేమ ఎందుకు విరిగిపోయింది? వారు మళ్లీ ఎందుకు కలుసుకున్నారు? అన్వీ తన భావాలను ఎప్పుడైనా రిషికి చెప్పిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు కథ ముందుకు సాగేకొద్దీ తెలుస్తాయి.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

దర్శకుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీని యూత్‌కు నచ్చేలా నడిపించాడు. ఫస్ట్ హాఫ్‌లో పెద్దగా కథ లేకపోయినా, షాట్ పంచులు, సహజమైన కామెడీతో బోర్ అనిపించకుండా చూసుకున్నాడు. సెెకండ్ హాఫ్‌లో మాత్రం పూర్తిగా కథ, భావోద్వేగాలపై దృష్టి పెట్టి ప్రేక్షకులను కనెక్ట్ చేశాడు. ప్రత్యేకంగా రోహిణి చెప్పే “అనుకున్నట్లు జరిగితే అది ప్రేమ ఎందుకు అవుతుంది” వంటి డైలాగ్స్ హృదయానికి హత్తుకుని లోతైన అర్ధాన్ని ఇచ్చాయి. అమ్మ గురించి చెప్పే మాటలు కూడా ప్రేక్షకుడి మనసులో నిలిచిపోయేలా ఉంటాయి.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

నటీనటుల విషయానికి వస్తే, హరీష్ ధనుంజయ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈజ్‌తో చేసిన నటన, డైలాగ్ డెలివరీ బాగుంది. అవంతిక తన పాత్రకు తగినంత న్యాయం చేసింది. అతుల్య కూడా ఆమె పాత్ర పరిమితుల్లో మంచి నటన చూపింది. దినేష్ పాత్ర చేసే నటుడు హిలేరియస్‌గా నవ్వించాడు. టెక్నికల్‌గా సినిమాకు ప్రధాన బలం మ్యూజిక్ — అరీష్ ఇచ్చిన సాంగ్స్, బీజీఎమ్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి, కానీ ఎడిటింగ్‌లో ఫస్ట్ హాఫ్‌లో కొంత లోపాలు కనిపిస్తాయి.

మొత్తం మీద, “మరువ తరమా” భావోద్వేగాలతో నిండిన, యూత్‌కి నచ్చే మంచి ప్రేమకథ

తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5