Ilaiyaraaja: ఇళయరాజా బర్త్‌డే స్పెషల్.. ఈ లెజెండ్ ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఇవే!

Adhika masa purnima (1)

Ilaiyaraaja: భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అద్భుతం.. స్వరాల సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతి.. ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా ఈరోజు తన 83వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నిజానికి ఆయన పుట్టినరోజు జూన్ 3 అయినప్పటికీ, దివంగత నేత ఎం.కరుణానిధి గారి జయంతి కూడా అదే రోజు కావడంతో… ఆయనపై ఉన్న గౌరవార్థం ఒక రోజు ముందే (జూన్ 2న) ఇళయరాజా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం విశేషం. మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

రాజకీయ దిగ్గజాల శుభాకాంక్షలు..
తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం ఎమ్.కె. స్టాలిన్ ఇళయరాజాకు పుట్టినరోజు అభినందనలు తెలియజేశారు. వారితో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కె.అన్నామలై తదితర రాజకీయ నాయకులు ఇసైజ్ఞాని సంగీత ప్రస్థానాన్ని కొనియాడుతూ శుభాకాంక్షలు చెప్పారు. ఇళయరాజా సంగీతంతో తమ కెరీర్‌లో ఎన్నో మరుపురాని హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆయనకు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. అలాగే మరో ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఇళయరాజా లెగసీని ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. వీరితో పాటు కోలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన పలువురు నటీనటులు, టెక్నీషియన్స్ ఆయనకు శుభాకాంక్షల వర్షం కురిపించారు.

Also Read :  Jagapathi Babu: బసిరెడ్డి తర్వాత మళ్లీ ఆ రేంజ్ క్యారెక్టర్.. ‘అప్పలసూరి’: జగపతిబాబు

అప్రతిహత ప్రస్థానం..
ఇప్పటివరకు ఇళయరాజా తన కెరీర్‌లో ఏకంగా 8,600 కి పైగా పాటలకు స్వరాలు సమకూర్చారు. సంగీతంలో ఆయన చూపిన ప్రతిభకు గానూ 5 జాతీయ అవార్డులు ఆయనను వరించాయి. అలాగే భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మవిభూషణ్’ పురస్కారంతో సత్కరించింది.

83 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు..
వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే అని ఇళయరాజా నిరూపిస్తున్నారు. 83 ఏళ్ల వయసులోనూ ఆయన సరికొత్త ట్యూన్స్‌తో దూసుకుపోతున్నారు. నేటి తరం యువ దర్శకులతో కలిసి పని చేస్తూ సరికొత్త మ్యూజిక్‌ను సినిమా లవర్స్‌కు అందిస్తున్నారు. రాబోయే ఆగస్టు నెలలో చెన్నై వేదికగా ఒక గ్రాండ్ ‘సింఫనీ’ (Symphony) కన్సర్ట్‌ను నిర్వహించడానికి ఇళయరాజా ప్లాన్ చేస్తున్నారు. దశాబ్దాలుగా కోట్లాది మంది గుండెల్లో తన సంగీతంతో నిలిచిపోయిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారికి మనమూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. మరిన్ని అద్భుతమైన ట్యూన్స్ ఆయన నుంచి రావాలని కోరుకుందాం.