Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’లో శివరాజ్ కుమార్ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

Peddi

Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ఊపందుకుంది. గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ స్వరపరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, లుక్స్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇదిలా ఉంటే, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. గంభీరమైన చూపు, మందపాటి హ్యాండిల్ బార్ మీసంతో శివరాజ్ కుమార్ లుక్ సోషల్ మీడియాలో భారీ స్పందన రేపుతోంది. ఈ సినిమాలో ఆయన ‘గౌర్నాయుడు’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ లుక్‌తో ఆయన పాత్ర సినిమా కథలో కీలకంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.