Arnold Vosloo: హాలీవుడ్ టూ టాలీవుడ్.. ఆ ‘భయంకరమైన’ విలన్‌ను దింపేస్తున్న ‘రణబాలి’.. డైరెక్టర్ ఎమోషనల్!

Arnold Vosloo

Arnold Vosloo: చిన్నప్పుడు మనల్ని భయపెట్టిన హాలీవుడ్ స్క్రీన్ ‘మాన్‌స్టర్’.. ఇప్పుడు ఇండియన్ సినిమాలో రచ్చ చేయడానికి రెడీ అయ్యారు. ‘ది మమ్మీ’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఆయన బర్త్‌డే సందర్భంగా సినిమా డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ పంచుకుంది.

“నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడి చూసిన చిత్రాల్లో ‘ది మమ్మీ’ ఒకటి. అందులోని ప్రతి పాత్ర నాకు ఇష్టమే. కానీ, అన్నింటికంటే మిన్నగా ఆ చిత్రంలోని విలన్ పాత్రే.. ‘నిజంగానే రాక్షసులు ఉంటారు’ అనే నమ్మకాన్ని నాలో కలిగించింది. చాలా ఏళ్ల తర్వాత నేను ఒక పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌ను రాసుకున్నాను. ‘ది మాన్‌స్టర్ ఇన్ యూనిఫామ్’, ‘ది డెమన్ ఆఫ్ ది డ్రాట్’.. ఆయనే #Ranabaali చిత్రంలో విలన్ ‘సర్ థియోడర్ హెక్టర్’. అయితే, నా చిన్ననాటి ఫేవరెట్ విలన్‌ను నేను కళ్లారా చూస్తానని, ఆయనతో కలిసి పని చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆర్నాల్డ్ వోస్లూ గారితో వర్క్ చేయడం నాకొక గొప్ప ప్రివిలేజ్. ప్రపంచానికి ఆయన ఒక అద్భుతమైన నటుడిగా తెలుసు, కానీ ఆయనతో కలిసి పనిచేసిన తర్వాతే తెలిసింది.. ఆయన ఎంత స్వీట్, కైండ్ అండ్ పేషెంట్ ఆర్టిస్ట్ అనేది!” అంటూ డైరెక్టర్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

Also Read :  Peddi: మిక్సిడ్ టాక్‌ను తలకిందులు చేస్తూ రూ. 250 కోట్ల దిశగా 'పెద్ది'!

‘హెక్టర్’ పాత్రలో మీరు సృష్టించిన మ్యాజిక్‌ను ప్రేక్షకులు థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తారా అని నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే సార్. మీకు ఆయురారోగ్యాలు, మరిన్ని చిరస్మరణీయ చిత్రాలు దక్కాలని కోరుకుంటున్నాను” అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హాలీవుడ్ రేంజ్ విలన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో ‘రణబాలి’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటిస్తున్నారు.