Lenin: అఖిల్ ‘లెనిన్’లో మెగా వాయిస్ ఓవర్.. చిరంజీవి మాటలతోనే సినిమా షురూ?

Lenin

Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘లెనిన్’ (Lenin). మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈ చిత్రాన్ని జూలై 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఒక స్టార్ హీరో వాయిస్ ఓవర్ (Voice Over) ఇవ్వబోతున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుండగా.. తాజా సమాచారం ప్రకారం ఆ స్టార్ హీరో మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి అని తెలుస్తోంది.

Also Read :  Maa Inti Bangaram : సెన్సార్ పూర్తి.. హైలైట్ గా సమంత పెర్ఫార్మెన్స్ !

మెగాస్టార్ చిరంజీవి తన పవర్‌ఫుల్ వాయిస్‌తో ఈ సినిమాను స్టార్ట చేయబోతున్నారని సమాచారం. కథను పరిచయం చేస్తూ సాగే ఈ నరేషన్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంటుందని టాక్. కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే కాకుండా.. కథలో అత్యంత కీలకమైన ప్రీ-ఇంటర్వెల్ (Pre-Interval) సీక్వెన్స్, అలాగే క్లైమాక్స్ (Climax) ఎపిసోడ్‌లలో కూడా మెగా వాయిస్ వినిపిస్తూ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు ఎలివేట్ చేయబోతున్నారని సమాచారం. అక్కినేని, మెగా కుటుంబాల మధ్య ఉన్న మంచి అనుబంధంతోనే ఈ వాయిస్ ఓవర్‌కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగా వాయిస్ ఓవర్‌పై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.