
Alpha: బాలీవుడ్ బాక్సాఫీస్‌లో తాజాగా మారుతున్న ట్రెండ్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ మాత్రమే సక్సెస్‌కి సరిపోవని, ప్రేక్షకులను మెప్పించే వినోదం, బలమైన స్టోరీ ఉంటేనే సినిమా సక్సె్స్ సాధిస్తుందనే అభిప్రాయం మరింత బలపడుతోంది. తాజాగా విడుదలైన ‘ఆల్ఫా’ సినిమా థియేటర్స్‌లో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ చర్చ మరింత గట్టిగా సాగుతోంది. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ‘ఆల్ఫా’లో స్టోరీని ఆసక్తికరంగా మలచడంలో లోపాలు ఉండటంతో పాటు పాత తరహా స్పై డ్రామా ట్రీట్మెంట్ ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెబుతున్నారు.
మరోవైపు, కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా వినోదానికి ప్రాధాన్యం ఇచ్చిన ‘వెల్కమ్ టు ది జంగిల్’, ‘ధమాల్ 4’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడంతో బాలీవుడ్లో ప్రస్తుతం “ఎంటర్టైన్మెంట్ ఈజ్ కింగ్” అనే అభిప్రాయం బలపడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ దృష్టి రాబోయే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులపై పడింది. ముఖ్యంగా ‘మాతృభూమి’, అలాగే రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమాల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రెండు చిత్రాలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ‘ఆల్ఫా’ రిజల్ట్ ఒక్క సినిమాకే పరిమితం కాకుండా, ప్రేక్షకుల అభిరుచి ఎలా మారిందనే విషయాన్ని బాలీవుడ్‌కు గుర్తు చేసిన సంఘటనగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై భారీ సక్సెస్ సాధించాలంటే స్టార్ పవర్ కంటే బలమైన స్టోరీ, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే, పూర్తి స్థాయి వినోదం తప్పనిసరిగా ఉండాలనే సందేశాన్ని తాజా పరిణామం స్పష్టంగా తెలియజేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.











