Fauzi: ఆగస్టు 3 నుంచి ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్.. ఫైనల్ షెడ్యూల్‌కు రంగం సిద్ధం!

FAUZI (2)

Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, తాజా షూటింగ్ అప్‌డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ ఆగస్టు 3 నుంచి మరోసారి ‘ఫౌజీ’ షూటింగ్‌లో పాల్గొననున్నారట. మరోవైపు ఈ చిత్ర కథానాయిక ఇమాన్వి ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఆమె కూడా త్వరలోనే ఈ షెడ్యూల్‌లో జాయిన్ కానున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చివరి షెడ్యూల్‌లో సినిమాకు కీలకమైన సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించనున్నారని సమాచారం. ముఖ్యంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హై-వోల్టేజ్ ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే ప్రభాస్–ఇమాన్వి జంటపై తెరకెక్కించే ఓ రొమాంటిక్ సాంగ్‌ను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నట్లు సమాచారం. దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని యాక్షన్, ఎమోషన్, ప్రేమ కథల సమ్మేళనంగా తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రతి సన్నివేశాన్ని అత్యంత నాణ్యతతో తెరకెక్కిస్తూ, ప్రభాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సినిమాను రెడీ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ చివరి దశలోకి అడుగుపెట్టిన ‘ఫౌజీ’, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.