Shahid Kapoor AA23: అల్లు అర్జున్ – లోకేశ్ కనగరాజ్ సినిమాలో బాలీవుడ్ హీరో? ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ బజ్!

AA23

Shahid Kapoor AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #AA23పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరును చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథలో కీలక మలుపు తీసుకొచ్చే పాత్రకు ఆయనను తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

షాహిద్ కపూర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే, సినిమాకు బాలీవుడ్ మార్కెట్‌లో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉందని చిత్ర బృందం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే అల్లు అర్జున్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేశ్ స్టైలిష్ మేకింగ్, అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసివస్తే భారీ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా ఈ సినిమా నిలుస్తుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో షాహిద్ కపూర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరతారనే ప్రచారం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.