
Sardar 2 vs Mandadi: తమిళ బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ 10న ఆసక్తికరమైన పోటీ నెలకొననుంది. కార్తీ నటించిన స్పై థ్రిల్లర్ సీక్వెల్ ‘సర్దార్ 2’, సూరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సముద్ర నేపథ్య యాక్షన్ డ్రామా ‘మండాడి’ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో ఈ రెండు సినిమాలపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. పీ.ఎస్. మిత్రన్ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘సర్దార్ 2’లో కార్తీతో పాటు మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో గ్యాడ్జెట్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
మరోవైపు సూరి నటించిన ‘మండాడి’ సముద్ర నేపథ్యంలోని యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా హెచ్డీఆర్ టెక్నాలజీలో థియేట్రికల్ రిలీజ్ కావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తమిళనాడులో ఈ రెండు చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. స్టార్టింగ్‌లో ‘మండాడి’ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఓ దశలో ‘మండాడి’ రూ.94.56 లక్షల బుకింగ్స్ సాధించగా.. ‘సర్దార్ 2’ రూ.78.89 లక్షలతో ఉంది. అయితే ఆ తర్వాత రెండు సినిమాల బుకింగ్స్ మధ్య వ్యత్యాసం తగ్గినట్లు తెలుస్తోంది. వినూత్న కాన్సెప్ట్స్, భారీ ప్రమోషన్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ రెండు చిత్రాల్లో.. సెప్టెంబర్ 10న థియేటర్లలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు తెలుగులోనూ ఒకే డేట్‌కి రిలీజ్ అవుతున్నాయి. సర్దార్ 2 ని అన్నపూర్ణ వాళ్లు రిలీజ్ చేస్తుండగా, మండాడి ని మైత్రీ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు.














