Kalingaraju : ఆకట్టుకునేలా ఆశిష్ గాంధీ ‘కళింగరాజు’ ఫస్ట్ లుక్..


నాటకం సినిమాతో హీరోగా ఆశిష్ గాంధీ, దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్‌ను చేయడం విశేషం. ఆశిష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగణ కాంబోలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ స్పెక్ట్రమ్ స్టూడియోస్, సుందరకాండ మోషన్ పిక్చర్స్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘కళింగరాజు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటుగా ఫస్ట్ లుక్‌ను ఈరోజు విడుదల చేశారు మేకర్స్.

Also Read :  Chiranjeevi: ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ విజయంపై మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్.. ఒక తండ్రిగా, నటుడిగా గర్వపడుతున్నానంటూ కామెంట్స్!

Mahesh Babu : ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదు.. ‘ప్రేమలు’ సినిమాపై మహేష్ బాబు

ఈ మేరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఊరి వాతావరణం కనిపిస్తోంది. ఇక ఆశిష్ గాంధీ కుర్చీ మీద కూర్చున్న తీరు, రక్తంతో తడిచిన ఆ కత్తి, రక్తపు మరకలతో కూడిన ఆ పాల క్యాన్ ఇదంతా చూస్తుంటే సినిమా అంతా రా అండ్ రస్టిక్‌గా ఉండేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read :  Abhisun Jeevinth: డైరెక్టర్‌గా హిట్టు.. హీరోగా సక్సెస్ .. ఇప్పుడు 'డ్రామా కంపెనీ'తో హ్యాట్రిక్‌పై కన్నేసిన అభిషన్ జీవింత్!

Kubera : ‘కుబేర’ కొత్త షూటింగ్ షెడ్యూల్ బ్యాంకాక్‌లో ప్రారంభం