Mahesh Babu : ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదు.. ‘ప్రేమలు’ సినిమాపై మహేష్ బాబు


మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ సినిమా మార్చి 8న తెలుగులోనూ రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కి ఆడియన్స్‌తో పాటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఫిదా అయిపోతున్నారు. తాజాగా ఈ మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ చిత్రంపై ప్రశంశల జల్లు కురిపించారు.

Aa Okkati Adakku : ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీజర్.. అల్లరోడి అల్లరి మామూలుగా లేదుగా !

“ప్రేమలు మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కార్తికేయకు కృతజ్ఞతలు. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓ సినిమా చూస్తూ చివరిసారి నేను ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదు. మా ఫ్యామిలీ మొత్తానికి సినిమా బాగా నచ్చింది. యంగ్‌స్టర్స్ అందరూ అద్భుతంగా నటించారు. మొత్తం టీమ్ కు నా అభినందనలు” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

ఇకపోతే గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ‘ప్రేమలు’ సినిమాలో నెస్లేన్ గఫూర్, మిమితా బైజూ హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రేమలు తెలుగు వెర్షన్‍కు ఆదిత్య హాసన్ డైలాగ్స్ రాశారు. ఇక ఈ చిత్రం సక్సెస్ మీట్ కు ముఖ్య అతిధిగా హాజరైన రాజమౌళి సైతం సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంశించారు. అంతేకాదు సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే వున్నా. అయితే ఈ నవ్వుల క్రెడిట్ అంతా కూడా రైటర్ ఆదిత్య హాసన్ కే ఇవ్వాలి. అతను డైలాగ్స్ అంత అద్భుతంగా రాసాడు. ఇక నటీ, నటులందరూ కూడా చక్కగా నటించారని ప్రశంసించారు. ఒక మంచి సినిమాను భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరస్తారని మరోసారి రుజువైందన్నారు.

Om Bheem Bush : ‘ఓం భీం బుష్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !!