Site icon TeluguMirchi.com

Chiranjeevi: మెగాస్టార్‌తో యంగ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్?

Srikanth Odela

Chiranjeevi: రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అనౌన్స్‌మెంట్‌తోనే ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్.. యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్. నేచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మాతగా మారి ప్రకటించిన ఈ కాంబో అనౌన్స్ కాగానే ఇండస్ట్రీ వర్గాలతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం విపరీతంగా ఎగ్జైట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ చుట్టూ ఫిలిం నగర్‌లో సరికొత్త గుసగుసలు మొదలయ్యాయి. అసలు ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేక పక్కన పెట్టేశారా అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

‘దసరా’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన శ్రీకాంత్ ఓదెల, తన రెండో సినిమాతో ప్రేక్షకుల్లో సరైన బజ్ క్రియేట్ చేయలేకపోయారు. ఆ మూవీకి వచ్చిన టాక్ ఈ ప్రాజెక్ట్ సమీకరణాలను కాస్త మార్చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవితో చేయాల్సిన సినిమా పట్టాలెక్కడానికి కాస్త సమయం పడుతుందని స్వయంగా నిర్మాత నాని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ గ్యాప్‌లో శ్రీకాంత్ ఓదెల వేరే హీరోతో మరో ప్రాజెక్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారంటూ ప్రచారం మొదలవడంతో, ఇక చిరుతో చేయాల్సిన సినిమా దాదాపు అటకెక్కినట్లేనంటూ సోషల్ మీడియాలో జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

గతంలో సరైన ఫామ్‌లో లేని మెహర్ రమేష్‌ లాంటి దర్శకుడికే మెగాస్టార్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అలాంటిది తనను దైవంగా భావించే వీరాభిమాని, టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓదెలను చిరు అంత తేలిగ్గా పక్కన పెట్టేస్తారా అన్నది ఫ్యాన్స్ వాదన. సినిమా కాస్త లేట్ అయినా, సరైన స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత కచ్చితంగా సెట్స్‌పైకి వెళ్తుందని మరికొందరు గట్టిగా నమ్ముతున్నారు. ఏదేమైనా ఈ పుకార్లకు చెక్ పడాలంటే చిత్ర బృందం వైపు నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సిందే.

Exit mobile version