Darling : అందుకే ఈ సినిమాకి ప్రభాస్ మూవీ టైటిల్ పెట్టాం..?


ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ అశ్విన్ రామ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

డార్లింగ్ పేరుతో సూపర్ హిట్ సినిమా వచ్చింది. ప్రభాస్ గారిని అందరూ డార్లింగ్ అని పిలుస్తారు. ఈ సినిమాకి అదే టైటిల్ పెట్టడం ఎలా అనిపించిందని విలేకరి అడగగా.. ప్రభాస్ గారి డార్లింగ్ కల్ట్ హిట్ మూవీ. ప్రభాస్ గారిని అందరూ డార్లింగ్ అంటారని మా యూనిట్ అందరికీ తెలుసు. అయితే ఈ కథకు డార్లింగ్ అనే టైటిల్ యాప్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమగా పిలుచుకునే పదం డార్లింగ్. మా సినిమాకి ఇది పర్ఫెక్ట్ టైటిల్. ఇప్పటివరకూ ప్రభాస్ గారి ఫ్యాన్స్ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని ప్రేక్షకులే చెబుతారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

Also Read :  ‘పొలిమేర 3’ అనౌన్స్ మెంట్.. ఈ సారి మీ ఊహకందని ట్విస్టులతో..

అలాగే స్ప్లిట్ పర్సనాలిటీ అనగానే ఈ సినిమాను ‘అపరిచితుడు’ తో పోలుస్తున్నారు. కానీ కథ, కాన్ ఫ్లిక్ట్ పరంగా ఈ రెండు డిఫరెంట్ మూవీస్. అపరిచితుడులో శంకర్ గారు లార్జ్ స్కేల్ లో సోషల్ ఇష్యూస్ ని డీల్ చేశారు. డార్లింగ్ లో హోం ఇష్యూస్ డీల్ చేస్తున్నాం అన్నారు. డార్లింగ్ కి పెర్ఫెక్ట్ హీరో ప్రియదర్శి. ఓ సినిమా షూటింగ్ లో మేము కలిశాం. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఆయన వలనే ఈ ప్రాజెక్ట్ సాధ్యపడింది. ప్రియదర్శి చాలా ఎఫర్ట్ పెట్టారు. ఇక నభా నటేష్ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మ్ చేశారు. అలాగే అనన్య నాగేళ్లది వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆమె పాత్ర గుర్తుపెట్టుకునేలా వుంటుంది. ఇందులో విమెన్ పాత్రలన్నీ చాలా స్ట్రాంగ్ గా వుంటాయి అని డైరెక్టర్ అశ్విన్ రామ్ చెప్పారు.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

Also Read : ‘కన్నప్ప’ లో ‘తిన్నడు’ వాడే విల్లు అంత ప్రత్యేకమైందా..?