
Harshaali Malhotra : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అఖండ’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా, ప్రతి అంశంలోనూ తొలి భాగాన్ని మించి ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట లు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా, సి. రాంప్రసాద్ డీవోపీగా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఈ సినిమాలో బజరంగీ భాయిజాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హర్షాలీ మల్హోత్రా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘జనని’ అనే కీలక పాత్రలో ఆమె తొలిసారి తెలుగు తెరపై కనిపించనుండగా, సాంప్రదాయ చీరలో ఆమె లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు నేషన్‌వైడ్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు. బాలకృష్ణ ఇందులో మునుపెన్నడూ చూడని మాస్ అవతారంలో దర్శనమివ్వనున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.












