Nag Ashwin: ‘నాకు ఏం చేస్తున్నానో తెలుసు.. పార్ట్ 2 వరకు వెయిట్ చేయండి!’.. విమర్శకులకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్

WhatsApp Image 2026 07 14 at 3.03.58 AM

Nag Ashwin: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టించిందో తెలిసిందే. అలాగే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల మధ్య కూడా విస్తృత చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ చిత్రంలో మహాభారతంలోని కీలక పాత్ర అయిన కర్ణుడి పాత్ర చుట్టూ సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు, నెటిజన్లు కర్ణుడి పాత్రను చూపించిన విధానంపై ప్రశ్నలు లేవనెత్తగా, తాజాగా ఈ విమర్శలకు నాగ్ అశ్విన్ నేరుగా స్పందించారు.

ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కథను ఎంతో ఆలోచించి రాసుకున్నానని, ప్రతి పాత్ర వెనుక బలమైన కారణం ఉందని చెప్పారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలనే తన స్టోరీకి ఆధారంగా తీసుకున్నానని నాగ్ అశ్విన్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రేక్షకులు చూసింది తన కథలో ఒక భాగం మాత్రమేనని, పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకోవాలంటే కల్కి పార్ట్ 2 రిలీజ్ వరకు వేచి చూడాలని సూచించారు. “నాకు ఏం చేస్తున్నానో తెలుసు.. పార్ట్ 2 వరకు వెయిట్ చేయండి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఒక్క కామెంట్‌తో విమర్శకులకు నాగ్ అశ్విన్ గట్టి సమాధానం ఇచ్చారని నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కల్కి పార్ట్ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్‌లో మిగిలిన అనేక ప్రశ్నలకు ఈ సెకండ్ పార్ట్‌లో సమాధానాలు దొరికే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణుడి పాత్రతో పాటు కథలోని పలు కీలక అంశాలపై పార్ట్ 2లో మరింత స్పష్టత రానుందని అభిమానులు కూడా దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.