
Prabhas – Aditya Dhar: బాహుబలి సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం స్పిరిట్, ‘సలార్-2’, ‘ఫౌజీ’, ‘కల్కి-2’ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ‘ధురంధర్’ ఫేమ్ ఆదిత్య ధర్‌తో ప్రభాస్ ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో #Prabhas, #AdityaDhar అనే ట్యాగ్స్‌తో ఫ్యాన్స్ ఈ న్యూస్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
ఫిలిం నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఆదిత్య ధర్ ప్రభాస్ కోసం ఒక పవర్‌ఫుల్ హై-వోల్టేజ్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారట. ఇప్పటికే చర్చలు ముగిశాయని, ప్రభాస్ కూడా ఈ లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అక్టోబర్ 23న రాబోయే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ కొల్లాబరేషన్ గనుక నిజం అయితే.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ విజువల్ వండర్‌గా నిలిచిపోవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదిత్య ధర్ టేకింగ్, ప్రభాస్ మాస్ కటౌట్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ వంటి టాప్ డైరెక్టర్లతో పాటు ఇప్పుడు ఆదిత్య ధర్ కూడా ప్రభాస్ లైనప్‌లోకి రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రేజీ అప్‌డేట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.













