Aditya Dhar: ప్రభాస్‌పై కన్నేసిన ‘ధురంధర్’ డైరెక్టర్.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్?

Prabhas

Aditya Dhar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చేసేందుకు దర్శకులు క్యూ కడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ అగ్ర దర్శకుడు ఆదిత్య ధర్ చేరినట్లు సోషల్ మీడియా కోడైకూస్తుంది. ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న ఆయన, ఇటీవల ‘ధురంధర్’, ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ‘ధురంధర్ 2’ భారీ విజయం సాధించిన తర్వాత ఆదిత్య ధర్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌కు చెందిన టాప్ హీరోలతో పాటు దక్షిణాదికి చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం ఆయనను సంప్రదించినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ స్టార్ డైరెక్టర్ మాత్రం కేవలం ప్రభాస్‌తోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

Also Read :  Peddhi Movie Budget: "పెద్ది" బడ్జెట్‌లో సగం జీతాలేనా! రెమ్యూనిరేషన్ల కోసమే రూ. 170 కోట్లా?

సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేని స్టార్‌డమ్
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండియా వైడ్‌గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న ఏకైక హీరో ప్రభాస్. ఆయనకున్న అసాధారణమైన మార్కెట్, మాస్ ఇమేజ్ కారణంగా ప్రతి టాప్ డైరెక్టర్ ‘డార్లింగ్’తో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నారు. ఈ జాబితాలో ఆదిత్య ధర్ కూడా చేరినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ కథలు, హై-వోల్టేజ్ యాక్షన్ సబ్జెక్ట్‌లకు ప్రభాస్ అయితే పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని ఆయన భావిస్తున్నారట. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ గనుక సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద యాక్షన్ ప్రియులకు పూనకాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.