Spirit : ‘స్పిరిట్’ నుండి ప్రకాశ్ రాజ్ అవుట్?

Prakashraj sandeep vanga
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ లో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇటీవల విడుదలైన వాయిస్ గ్లింప్స్‌లో ప్రభాస్, ప్రకాశ్ రాజ్ పవర్‌ఫుల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యి సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరియు ప్రకాశ్ రాజ్ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా ప్రకాశ్ రాజ్ లేకుండానే చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని, ఆయన పాత్రకు మార్పు జరిగే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

ఇదిలా ఉండగా స్పిరిట్ సినిమా ఇప్పటికే పలుమార్లు కాస్ట్ మార్పులకు గురైంది. మొదట హీరోయిన్‌గా దీపికా పదుకొణెను ఎంపిక చేసినప్పటికీ, భేదాభిప్రాయాల కారణంగా ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అనంతరం ఆ స్థానంలో త్రిప్తి దిమ్రిని తీసుకున్నారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్‌పై వస్తున్న ఈ రూమర్స్‌పై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వార్తలు నిజమా కాదా అన్నది త్వరలోనే మేకర్స్ నుంచి వచ్చే స్పష్టీకరణతో తేలనుంది.