‘RRR’ విలన్ ఇక లేరు..!


సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్, శరత్ బాబు రెండు రోజుల వ్యవధిలోనే మృతి చెందగా.. తాజాగా మరో నటుడు కన్నుమూశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో విలన్‌గా తెలుగువారికి సుపరిచితుడైన హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్ ‌సన్ సోమ‌వారం చనిపోయారు. ప్రస్తుతం ఆయన వయస్సు 58 సంవత్సరాలు. ఆయన ఈమధ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఓ అంతర్జాతీయ వార్తాపత్రిక వెల్లడించింది. ఇక ప్రస్తుతం క్యాసినో ఇన్ ఇశ్చియా అనే మూవీ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన స్టీవెన్ సన్ అక్కడే మరణించారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

హాలీవుడ్‌లో రే స్టీవెన్‌సన్ మంచి పేరున్న నటుడు. అంతేకాదు RRR సినిమాలో స్కాట్ దొర పాత్రలో ఆయన తన నటనతో ఆకట్టుకున్నారు. 1990లలో టీవీ షోలతో కెరియర్ ప్రారంభించిన ఆయన 1998లో వచ్చిన ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్’ ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కింగ్ ఆర్థర్, థోర్, స్టార్ వార్స్, వైకింగ్స్, ట్రాన్స్‌పోర్టర్ లాంటి టాప్ హాలీవుడ్ సినిమాల్లో కూడా రే స్టీవెన్సన్ నటించారు. ఇప్పుడు ఆయన ఆకస్మిక మరణంతో చిత్ర సీమలో విషాదం నెలకొంది. ఆర్ఆర్ఆర్ నటుడు మరణంతో దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ తో పటు పలువురు ప్రముఖులు ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు.