
Jr NTR: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. భుజం సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకున్న తారక్.. తాజాగా ‘డ్రాగన్’ షూటింగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్‌లోకి తిరిగి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. తొలుత టాకీ పార్ట్ సన్నివేశాల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి వారాల్లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నట్లు సమాచారం. తారక్ రీఎంట్రీతో ‘డ్రాగన్’ షూటింగ్ మరింత వేగం అందుకోనుంది.
ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బిజు మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటులు షాహిద్ కపూర్, ఆలియా భట్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘డ్రాగన్’ గ్లింప్స్‌కు భారీ స్పందన వచ్చింది. విడుదలైన 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సత్తా చాటినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ‘డ్రాగన్’పై ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా తారక్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఏ రేంజ్లో ఉండబోతున్నాయో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.













