Vijay Sethupathi : ఎందుకీ అనుకోని మలుపు..? విజయ్ సేతుపతి – పాండిరాజ్ కలయిక వెనక నిజం.!

Vijay sethupathi

 

Vijay Sethupathi : జాతీయ అవార్డు విజేత, ప్రముఖ తమిళ దర్శకుడు పాండిరాజ్, స్టార్ నటుడు విజయ్ సేతుపతి కలిసి ఓ కొత్త ప్రాజెక్టులో భాగమవడం ఇండస్ట్రీలో ఆసక్తిని రేపుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ‘తలైవన్ తలైవి’ అనే పేరు ఖరారు చేశారు. నిత్యా మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం జూలై 25న థియేటర్లలో విడుదల కానుంది.

ఇంతకుముందు పాండిరాజ్-సేతుపతి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలిసింది. ఆ సమయంలో ఇద్దరూ జీవితంలో మళ్లీ కలిసి పని చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు దర్శకుడు పాండిరాజ్ స్వయంగా వెల్లడించారు. అయితే ఈ అనుకున్నది అనుకున్నట్లుగా సాగలేదని, ఓ సందర్భంలో ఆ ద్వేషం వీడిపోయిందని వివరించారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ప్రముఖ దర్శకుడు మిష్కిన్ పుట్టినరోజు వేడుకలో పాండిరాజ్, సేతుపతి మళ్లీ కలుసుకున్నారు. అప్పుడే విజయ్ సేతుపతి స్వయంగా పాండిరాజ్‌ను సంప్రదించి “ఒక సినిమా చేద్దాం” అని చెప్పారు. ఈ అనూహ్య పరిణామం వారిద్దరినీ తిరిగి కలిపిందని పాండిరాజ్ తెలిపారు. ఆ తర్వాత పాండిరాజ్ ‘తలైవన్ తలైవి’ కథను సిద్ధం చేసి, కేవలం 20 నిమిషాల్లోనే సేతుపతికి వివరించారట. కథ విన్న వెంటనే ఆయన వెంటనే అంగీకరించారు.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. కుటుంబ కథా చిత్రం కావడంతో వేసవి సెలవుల తర్వాత విడుదలయ్యే ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.