Akhil Akkineni: ‘హిట్ అయితే తెలుగు ప్రేక్షకులు భుజాలపై మోస్తారు’..

Lenin akhil

Akhil Akkineni: ఇటీవల ‘లెనిన్’ సినిమాతో తన కెరీర్‌లో ఫస్ట్ సక్సెస్‌ను అందుకున్న అక్కినేని హీరో అఖిల్ అక్కినేని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి, తమిళ స్టార్ హీరో సూర్య గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మంచి సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకుల మనస్తత్వంపై అఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అఖిల్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులకు ఒకే ఒక్క భాష తెలుసు.. అది మంచి సినిమా. సినిమా బాగుంటే అది ఏ భాషలో వచ్చినా మన ప్రేక్షకులు హృదయపూర్వకంగా ఆదరిస్తారు” అని అన్నారు. అలాగే తమిళ స్టార్ హీరో సూర్య గురించి మాట్లాడుతూ.. “సూర్య సర్ ‘గజిని’ నుంచి ప్రతిసారి మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు మన స్టార్ హీరోలకు ఇచ్చే స్థాయిలోనే ఆదరించారు. బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌ను అందించారు. చరిత్ర కూడా ఇదే విషయాన్ని ఎన్నోసార్లు నిరూపించింది” అని అన్నారు. తాజాగా అఖిల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచి కంటెంట్‌కు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అండగా నిలుస్తారనే విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.