Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ వాయిదా?.. ఆ వార్తల్లో నిజమెంత? క్లారిటీ ఇచ్చిన టీమ్!

Vishwambhara

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ తేదీకి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి-బాబి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాతే, ‘విశ్వంభర’ రిలీజ్ అవుతుందనే ప్రచారం ఫిలిం సర్కిల్స్‌లో జోరందుకుంది.

Also Read :  Mega 158: సంక్రాంతి బరిలో మెగాస్టార్.. బాబీ సినిమా రిలీజ్ ఆల్మోస్ట్ ఫిక్స్!

ఈ ప్రచారంపై ‘విశ్వంభర’ మూవీ టీమ్‌కి చెందిన కొంతమంది కీలక సభ్యులు స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, మెగా 158 కంటే ముందే ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన పక్కా రిలీజ్ తేదీని మేకర్స్ అధికారికంగా లాక్ చేయనప్పటికీ, ఈ ఏడాది (2026) లోనే ‘విశ్వంభర’ కచ్చితంగా థియేటర్లలోకి వస్తుందని టీమ్ క్లారిటీ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పనులు పూర్తయిన వెంటనే గ్రాండ్‌గా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తారని సమాచారం.