D56: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ధనుష్ కొత్త సినిమా.. !

Cinema

D56: తమిళ స్టార్ హీరో ధనుష్ 56వ చిత్రాన్ని (#D56) అధికారికంగా ప్రకటించారు. టాలెంటడ్ డైరెక్టర్ తమిళ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రిమార్క్ ప్రొడక్షన్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య, ప్రముఖ హాస్య నటుడు వడివేలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య, లింగుస్వామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, విజయ్ బి. కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
భారీ తారాగణం, అత్యున్న సాంకేతిక బృందంతో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టును 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. కాంబినేషన్ అనౌన్స్‌మెంట్‌తోనే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, పరిశ్రమ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.