
Kaantha : దుల్కర్ సల్మాన్ తాజా రెట్రో బ్లాక్‌బస్టర్ ‘కాంత’ నవంబర్ 14న విడుదలై అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రల్లో నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించారు. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ మరియు రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విడుదలైన వెంటనే బ్లాక్‌బస్టర్ టాక్‌తో ముందుకు దూసుకెళ్లింది. ఈ విజయోత్సాహాన్ని జరుపుకుంటూ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. కాంత సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్నిచ్చింది. ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దుల్కర్ గారి కెరీర్ ఫైనస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మ్యూజిక్, విజువల్స్ టెక్నికల్ వాల్యూస్ గురించి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూ వున్న సినిమా ఇది. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్ వస్తుంది. జోనర్ బెండింగ్ సినిమా గా వచ్చిన ఫస్ట్ ఫిలిమ్ ‘కాంత’. ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. మద్రాస్ నేపథ్యంలో జరిగే కథ కావడం, ఎలాంటి అంచనా లేకుండా చూడటంతో మద్రాస్ ఆడియన్స్ ఇంకా అద్భుతంగా కనెక్ట్ అయ్యారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు రానా, భాగ్యశ్రీ సమాధానాలు ఇచ్చారు.
దుల్కర్‌తో కలిసి ఈ సినిమా నిర్మించడానికి కారణం ఏమిటని అడిగినప్పుడు రానా, ఇండిపెండెంట్ ఆర్ట్ సినిమాలను ఇద్దరూ ఇష్టపడతామని, కలసి పనిచేయడం ఎప్పుడూ ప్రత్యేకమని తెలిపారు. ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత స్క్రీన్‌పై కనిపించానని, తన పాత్రకు మంచి అప్లాజ్ రావడం ప్రత్యేకంగా అనిపించిందన్నారు. భాగ్యశ్రీ పాత్రకు కూడా అద్భుత స్పందనం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 50–60 దశకాల నేపథ్యంలో రూపొందిన ‘కాంత’ సెట్స్ కోసం వాహిని, ఏవీఎం స్టూడియోల రిఫరెన్సులను ఉపయోగించామని, ప్రతి ఫ్రేమ్‌ను పెయింటింగ్‌లా తీర్చిదిద్దారని చెప్పారు.
తమిళ్‌లో తొలి సినిమాగా ‘కాంత’లో నటించిన భాగ్యశ్రీ, ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రతి లైన్‌ను డైరెక్టర్ సెల్వ మార్గదర్శకత్వంలో క్షుణ్ణంగా నేర్చుకొని తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించానని, ఆడియన్స్ నుంచి వస్తున్న ప్రేమ తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ పాత్ర కోసం ఆరు నెలలు చెన్నైలో గడిపిన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కోసం సావిత్రి గారు, శ్రీదేవి గారు చేసిన చాలా సినిమాలు చూశాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. అందులోనూ పాత సినిమాలు ఇంకా ఇష్టం. అవన్నీ కూడా దీనికి ఉపయోగపడ్డాయి. తమిళ్లో, తెలుగులో రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇంత మంచి రెస్పాన్స్ ని నేను ఊహించలేదు. రెండు వారాల్లో తన నటనలో రెండు సినిమాలు విడుదల కావడం ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.
