
Mahesh Babu: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ‘వారణాసి’ గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారుతోంది. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా అందుతున్న ఒక కీలక సమాచారం అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన లుక్‌ను పూర్తిగా మార్చేయడమే కాకుండా, ఈ చిత్రంలో తన కీలక సన్నివేశాల షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట దావానలంలా వ్యాపిస్తోంది.
ఈ సినిమా కోసం గడ్డం, పొడవాటి జుట్టుతో పూర్తి రగ్గడ్ అవతారంలో కనిపిస్తూ వచ్చిన హీరో.. తాజాగా ఆ గెటప్‌కు స్వస్తి పలికారు. తాజాగా సూపర్ స్టార్ తన ఒరిజినల్ హ్యాండ్‌సమ్, క్లీన్-షేవ్ స్టైలిష్ అవతారంలోకి మారిపోయి దర్శనమిచ్చారు. సాధారణ జీన్స్, క్యాప్, స్టైలిష్ సన్‌గ్లాసెస్‌తో సరదాగా విహరిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ ఆయన కనిపించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్నాయి. ఆయన లుక్ మారడాన్ని బట్టి చూస్తే.. ‘వారణాసి’కి సంబంధించిన ప్రధాన ఘట్టాల షూటింగ్ పూర్తయినట్లేనని అభిమానులు, నెటిజన్లు ఒక అంచనాకు వచ్చేస్తున్నారు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ దిగ్గజ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 2027 ఏప్రిల్ నెలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. షూటింగ్ శరవేగంగా సాగుతుండటం, హీరో లుక్ సడన్‌గా మారడంతో రాజమౌళి రూపొందిస్తున్న విజువల్ వండర్‌పై రోజురోజుకూ అంచనాలు స్కై-హై లెవెల్‌కు చేరుకుంటున్నాయి.














