Coolie : రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. సినిమా విడుదల రోజు అభిమానుల ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని, ఉదయం 5 గంటలకే ప్రత్యేక షో వేసేందుకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా, విడుదల తేదీ నుండి పది రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ టీజర్ రిలీజ్.. ఫుల్ మాస్, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
ప్రభుత్వం ఆదేశాల ప్రకారం, మల్టీప్లెక్స్‌లలో సాధారణ రేట్లకంటే ₹100 అదనంగా, సింగిల్ స్క్రీన్స్‌లో ₹75 అదనంగా వసూలు చేసుకునే వీలుంటుంది. ఈ నిర్ణయం రజనీ అభిమానుల్లో మరింత ఉత్సాహం రేపుతోంది. సినిమా విడుదల రోజునే తెల్లవారుజామున మొదటి షో చూసేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈసారి ‘కూలీ’ కోసం అలాంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో, థియేటర్ల వద్ద భారీ హడావుడి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రజనీకాంత్ మార్కెట్, ఆయన సినిమాలపై అభిమానుల్లో ఉండే క్రేజ్ దృష్ట్యా, ఈ నిర్ణయం సినిమా కలెక్షన్లను మరింతగా పెంచుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Bun Butter Jam : ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బన్ బటర్ జామ్’ ట్రైలర్ రిలీజ్..

