Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ టీజర్ రిలీజ్.. ఫుల్ మాస్, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

Mass jathara
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రంగా వస్తున్న ప్రతిష్టాత్మక మాస్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ను భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 27న వినాయక చవితి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలతో ప్రేక్షకుల అంచనాలను పెంచింది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది.

Also Read :  NBK 111: బాలయ్య ఫ్యాన్స్ గోపీచంద్ ఫుల్ మీల్స్ .. జూన్ 10న మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ అంటూ పోస్ట్!

టీజర్‌లో రవితేజ ప్రత్యేక యాక్షన్ స్టైల్, వింటేజ్ ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. శ్రీలీల మరోసారి బలమైన పాత్రలో మెరిసి, రవితేజతో జోడీగా తెరపై మాయాజాలం సృష్టించారు. మాస్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించేలా పండుగ వాతావరణంలో ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్ హామీ ఇస్తోంది. భీమ్స్ సిసిరోలియో సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇప్పటికే పాపులర్ అయిన పాటలు, విధు అయ్యన్న కెమెరా పనితనం, నవీన్ నూలి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.

Also Read :  Buchi Babu: 'పెద్ది సెట్స్‌లో అప్పుడు కాళ్లు , చేతులు ఆడలేదు': బుచ్చిబాబు