Site icon TeluguMirchi.com

Ranabali Budget: రణబాలి టార్గెట్ రీచ్ అవుతుందా!

Ranabali Budget

Ranabali Budget: టాలీవుడ్ సెన్సేషనల్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘రణబాలి’. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పీరియాడిక్ డ్రామా దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది. పెళ్లి తర్వాత ఈ క్రేజీ జంట వెండితెరపై ఎలా కనిపించబోతోందన్న ఉత్కంఠ ఒకవైపు ఉండగా.. ఈ ప్రాజెక్ట్ చుట్టూ జరిగిన భారీ బడ్జెట్ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

స్వాతంత్య్రానికి పూర్వం రాయలసీమ గడ్డపై జరిగిన అమానవీయ వాస్తవ సంఘటనల నేపథ్యంలో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ కథను వెండితెరకు ఎక్కించారు. రణబాలి పాత్ర డిమాండ్ మేరకు టీజర్, ట్రైలర్‌లలో వయొలెన్స్ కూడా గట్టిగానే దట్టించారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ కావడంతో విజువల్స్ కోసం మేకర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. తొలుత రూ.80 కోట్లతో సినిమాను ముగించాలనుకున్నప్పటికీ, షూటింగ్ సాగేకొద్దీ ఖర్చులు తడిసిమోపెడై చివరకు బడ్జెట్ ఏకంగా రూ.120 కోట్లకు చేరినట్లు ఇండస్ట్రీ టాక్. ఇందులో కేవలం విజయ్, రష్మికల రెమ్యునరేషన్లకే దాదాపు రూ.30 కోట్ల వరకు కేటాయించినట్లు తెలుస్తోంది.

బడ్జెట్ భారీగా పెరిగినప్పటికీ నిర్మాతలకు ముందే పెద్ద ఊరట లభించింది. షూటింగ్ మొదలైన తొలి రోజుల్లోనే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటు చెల్లించి డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. శాటిలైట్, ఆడియో రైట్స్‌తో కలిపి నాన్-థియేట్రికల్ బిజినెస్ రూపంలోనే దాదాపు రూ.60 కోట్ల మేర రికవరీ వచ్చేసిందని అంటున్నారు.

ఇక మిగిలిన రూ.60 కోట్లను థియేట్రికల్ రన్ ద్వారా రాబట్టాల్సి ఉంది. విజయ్ దేవరకొండ ఖాతాలో సరైన సాలిడ్ హిట్ పడి చాలా కాలమే అయింది. అయితే ప్రస్తుతం ‘రణబాలి’పై ఉన్న హైప్, విజయ్-రష్మిక క్రేజ్ చూస్తుంటే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ రూ.60 కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదన్నది ట్రేడ్ వర్గాల అంచనా. మరి ఈ రియల్ లైఫ్ జోడీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Exit mobile version