
Shah Rukh Khan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. ఇటీవల ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్తపై తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ క్యామియో పాత్రలో కనిపించనున్నారనే ప్రచారానికి ముగింపు ఇచ్చినట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో షారుక్ క్యామియో లేదని చెబుతున్నారు. దీంతో ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ‘రాకా’ తదుపరి షూటింగ్ షెడ్యూల్ ముంబైలో నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించాలని మేకర్స్ నిర్ణయించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ కథ, పాన్ ఇండియా స్థాయి విజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ఫ్రాంచైజీగా తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక షారుక్ ఖాన్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నెలాఖరులో జరిగే తదుపరి షెడ్యూల్‌లో ఆయన జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం పనులు కొనసాగిస్తున్నట్లు సమాచారం.














