Site icon TeluguMirchi.com

Vishal35 : విశాల్ న్యూ మూవీ లాంచ్.. 45 రోజుల నాన్-స్టాప్ షూటింగ్ ప్లాన్!

Vishal35
Vishal35 : ‘మధ గజ రాజా’ బ్లాక్ బస్టర్ విజయంతో ఉత్సాహంలో ఉన్న హీరో విశాల్ తన 35వ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. 1990లో ‘పుదు వసంతం’తో ప్రారంభమైన ఈ సంస్థకు ఇది 99వ సినిమా కావడం విశేషం. రవి అరసు దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్, సంగీతం జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. దుషార విజయన్ కథానాయికగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు (జూలై 14) చెన్నైలో అట్టహాసంగా జరిగాయి. దర్శకులు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య, మణిమారన్, వెంకట్ మోహన్, శరవణన్, నటులు కార్తీ, జీవా, డిఓపి ఆర్థర్ ఎ. విల్సన్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చెన్నైలో చిత్రీకరణ ప్రారంభించి 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. సినిమా సంబంధిత మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Exit mobile version