
Vishal35 : ‘మధ గజ రాజా’ బ్లాక్ బస్టర్ విజయంతో ఉత్సాహంలో ఉన్న హీరో విశాల్ తన 35వ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. 1990లో ‘పుదు వసంతం’తో ప్రారంభమైన ఈ సంస్థకు ఇది 99వ సినిమా కావడం విశేషం. రవి అరసు దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్, సంగీతం జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. దుషార విజయన్ కథానాయికగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు (జూలై 14) చెన్నైలో అట్టహాసంగా జరిగాయి. దర్శకులు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య, మణిమారన్, వెంకట్ మోహన్, శరవణన్, నటులు కార్తీ, జీవా, డిఓపి ఆర్థర్ ఎ. విల్సన్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చెన్నైలో చిత్రీకరణ ప్రారంభించి 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. సినిమా సంబంధిత మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
And here we go, finally after the grand success of #MadhaGajaRaja, starting my next film #vishal35 under the production of @SuperGoodFilms_ produced by #RBchoudhary sir marking their 99th film directed by @dir_raviarasu It's our first collaboration. Sharing screen space with me… pic.twitter.com/fxM5meY7hc
— Vishal (@VishalKOfficial) July 14, 2025












