
Dulquer Salmaan : వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్, ఎప్పుడూ వినూత్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా తన 41(#DQ41)వ చిత్రం కోసం నూతన దర్శకుడు రవి నేలకుదిటితో చేతులు కలిపారు. ఈ సినిమా SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, ఇది వారి 10వ చిత్రం కావడం విశేషం. లవ్ స్టోరీతో పాటు హృద్యమైన హ్యూమన్ డ్రామాగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ముహూర్తపు షాట్‌కు నేచురల్ స్టార్ నాని క్లాప్ ఇవ్వగా, బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు రవి నేలకుదిటి మొదటి సన్నివేశాన్ని స్వయంగా తెరకెక్కించారు.
ఈ కార్యక్రమానికి శ్రీకాంత్ ఓదెల, గుణ్ణం సందీప్, రమ్య గుణ్ణం తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ మరియు టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనయ్ ఓం గోస్వామి విజువల్స్ అందించనుండగా, జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, తమిళ భాషలలో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మిగతా నటీనటులు, టెక్నికల్ టీం వివరాలను త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు.
The much awaited #DQ41 – a heartwarming contemporary love story – launched grandly with a pooja ceremony ✨❤️🔥
Natural Star @NameisNani gave the clap & blockbuster directors @odela_srikanth & @BuchiBabuSana graced the event to bless the team.
Starring @dulQuer 🌹
Directed by… pic.twitter.com/8w0BihMnxm— SLV Cinemas (@SLVCinemasOffl) August 4, 2025












