
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు హైకోర్టు అనుమతితో పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ని విద్యాశాఖ విడుదల చేసింది.
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.









